Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 4 January 2015

అక్షరకిరణాలు....



అక్షరకిరణాలు....

నిర్మలమైనది ఆ తెల్లకాగితం...
ఏ సిరా మరకలు లేని స్వచ్చదనం...
పాలవర్ణం ఆ కాగితం...
ఆ కాగితంపై నువ్వు...
అక్షరాలు చెక్కుతుంటే...
వాలిన నీ కనురెప్పలనుంచి...
నీ కనుదోయి కమలాల నుంచి...
చల్లని వెన్నెలగా కురుస్తున్న ...
ఆ అక్షరాలు...
రాసుకుంటున్న భావాలు...
అన్నీ నావే కదా...
నా మనో నేత్రం కంటున్న కలలు...
మనసు చెబుతున్న ఊసులు...
నా గుండె సుడులలో ...
రగులుతున్న కెరటాలు...
నాపై నా భావం...
నీపై చెలరేగుతున్న ఆలోచనలు...
నిన్నే చుట్టుకుంటూ...
నిన్నే ముద్దాడుతూ...
నీకోసమే మరణిస్తూ...
నీకై మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ...
నా భావ మాలికలన్నీ ...
ఉదయిస్తుంటే...
ఉదయించిన భావ కిరణాలను...
నువ్వు ఒక్కో అక్షరంగా ...
మలుస్తూ ఉంటే...
ఆ ప్రతి అక్షరం నీకే...
అంకితం కాదా...
మనస్వినీ...

No comments:

Post a Comment