Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 24 January 2015

మతలబు లేని మనస్సు...



మతలబు లేని మనస్సు...


మనసు భావాలకు ...
మతలబులు ఉంటాయా...
గుప్పెడు మనసు గుడిలో
దీపం చీకటినే ఇస్తుందా...
చందమామ ఎండను కాస్తుందా...
మనసైన మనసు
మనసునే మోసం చేస్తుందా...
మనసు భావాలను
పెదాలు మార్చేస్తున్నాయా...
మనసు గుడిలో కొలువుకు
అర్హతలున్నాయా...
మనసు పీఠం ఎక్కేందుకు
డిగ్రీలు కావాలా...
పాఠాలు నేర్చుకుని
ప్రేమించుకోవాలా...
అనుమానాలే కొలమానాలుగా
అబద్దాలే నిజాలుగా
క్షణం ఒక ఆలోచనగా
మనసును చంపుకుని
మనోవైకల్యమే
అర్హతగా మార్చుకుంటే
అలాంటి
పనికిమాలిన అర్హత
ప్రేమను నిలబెడుతుందా...
ఆ మనసు మనసేనా...
అది నిజంగా ప్రేమేనా...
అది కాదా నటనం...
మనస్వినీ..

No comments:

Post a Comment