Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 23 January 2015

నేను నేనే....




నేను నేనే...

నేనేంటో నాకు తెలుసు...
నేనేం చేసానో నాకే తెలుసు...
ఎవరేం చేసారో అందరికి తెలుసు...
కుట్రలు కుతంత్రాలు చేయలేదు నేను..
ఆవేశంలో నిర్ణయాలు తీసుకోలేదు నేను...
ఎవరికీ ఎలాంటి హామీలు ఇవ్వలేదు నేను...
హామీలు వమ్ము చెయ్యలేదు నేను...
అబద్దాలను అబద్దాలుగానే చూసాను...
నిజాన్ని నిజంగానే గౌరవించాను...
తప్పు చెయ్యలేదు నేను...
తప్పులనే ప్రశ్నించాను నేను...
అది తప్పేనని ఒప్పుకోను నేను...
మనసునే నమ్మి మోసపోయాను నేను...
ఒకే కోణంలో ఆలోచించలేదు నేను...
అన్ని కోణాలూ తెలుసుకున్నాను నేను...
ఒక్కటి మాత్రం నిజం మోసపోయాను నేను...
నేనేంటనేది తెలుసుకున్నాను నేను...
ఎవరి సర్టిఫికెట్టు కోరుకోలేదు నేను...
మనస్వినీ....

No comments:

Post a Comment