Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Saturday, 17 January 2015

మంతనమాడిన మనస్సు...మంతనమాడిన మనస్సు...


మంతనమాడిన మనసే...
మండుతోంది...
మనసైన మనసే ...
సర్వం అనుకున్న మనసే...
కన్నీరు పెడుతోంది...
మనసైనది మనదేననీ...
ఆ మనసంతా తానేననీ...
మనసులోనే నివాసమనీ...
మనసులోని మనసు తానేననీ...
ముచ్చటపడిన మనసు...
చిన్నబోయింది...
మనువాడిన మనసుతో ...
జతగూడాలనీ...
మనసారా మనసవ్వాలనీ..
మనసంటే మనమేననీ...
మనసుపడిన మనసు...
ముడుచుకుపోయింది...
మనసులో మనసులా ...
మసలుకోవటం కాదు...
మనసులో స్థానమే లేదనీ...
ఆ అర్హతే తనకు లేదని...
తెలుసుకున్న పిచ్చిమనసు...
తన విలువ గుర్తించి...
వెక్కి వెక్కి ఏడుస్తోంది...

No comments:

Post a Comment