Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 8 January 2015

గాయమూ పువ్వే...



గాయమూ పువ్వే...


మనసే మనసుకు ...
చేసిన గాయంలో...
విచ్చుకున్న పువ్వులెన్నో...
విరిసిన పువ్వుల్లో...
రాలిపడే కన్నీటి చుక్కలెన్నో...
గాయమనే పుష్పం ...
ఏనాటికైనా ...
వాడిపోదా...
మనసులో రేగిన వేదనలు...
ఎప్పటికైనా మానిపోవా...
ఉప్పెనలా ఎగసిపడే...
కడలి కెరటాలు...
సాగరంలోనే కలిసిపోవా...
చీకటి తర్వాత వెలుతురే రాదా...
నిశి రాతిరి వేళల్లో ...
చల్లని వెన్నెల కురియదా...
రగిలిన ప్రతి గుండె...
శాంతించక తప్పదు ...
మనస్వినీ...

No comments:

Post a Comment