Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 10 January 2015

పువ్వులో పువ్వు...



పువ్వులో పువ్వు...


ఒక పువ్వు ...
మరో పువ్వును...
ముద్దాడింది...
విరిసిన పుష్పంపై కురిసిన...
జలధార పునీతమయ్యింది...
స్వాతిముత్యపు చినుకై...
ఆ పువ్వులో లీనమయ్యింది...
నీ పాదం ఒక పద్మమైతే...
కురిసిన గంగ...
పునీతమే కదా...
నీ అడుగు ...
ఒక పుష్పమైతే...
ప్రణమిల్లిన బంతి...
నలిగిపోయేందుకు...
తనను తాను ...
అర్పించుకోదా...
ఆ జలధార...
ఫిదాయీ బంతి...
అన్నీ నా మనసే కదా...
మనస్వినీ...

No comments:

Post a Comment