Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday 11 January 2015

అది ఒక క్షణమే నాకు...



అది ఒక క్షణమే నాకు...


నల్లని ముసుగేసుకున్న ...
నిశికన్య నాకెంతో ఇష్టం...
అంతే కోపం కూడా...
ఇలా వచ్చి ...
అలా వెళ్ళిపోతుంది...
తనతో గడపాలనీ...
తన నీడన...
నెచ్చెలితో సేదతీరాలని...
తన దుప్పటిని ముసుగేసుకుని...
తన కాంత పరువాలు ...
దోచేయాలనీ...
మనసారా మాట్లాడుకోవాలనీ...
అలసిన మనసున...
మాటల పువ్వులు ...
పూయించాలనీ...
ఎంతగానో ఆరాటం నాకు...
ఎందుకో నిశి కన్యకు ...
మాపై కోపం...
నిద్ర అనే మత్తుమందు చల్లి...
తన దుప్పటి లాగేసుకుంటుంది...
అందుకే తనంటే...
నాకెంత ఇష్టమో...
అంతే అయిష్టం...
క్షణం ఒక యుగమని ...
అంటుంటారు...
నిశివేళ...
నాకది ఒక క్షణమే...
మనస్వినీ...

No comments:

Post a Comment