Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 12 August 2020

గుండెల నిండా తెలంగాణా..(PART-25)


గుండెల నిండా తెలంగాణా..(PART-25)
నా జర్నలిజం ప్రస్థానంలో తెలంగాణా ఉద్యమం ఒక సువర్ణాధ్యాయం అని చెప్పవచ్చు.. ఎన్నో ప్రజా ఉద్యమాలు చూసాను సంచలన వార్తలు కవర్ చేసాను కానీ తెలంగాణా ఉద్యమంలో ఎదుర్కొన్నంత ఉద్విగ్నత ఎప్పుడూ ఎదురుకాలేదు.. ముఖ్యంగా నేను జీ ఇరవైనాలుగు గంటలు ఛానల్ లో పని చేసిన సమయం ఒక అపూర్వ ఘట్టంలో భాగం కావడాన్ని గర్వించదగ్గ అంశంగానే భావిస్తున్నా..
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణా ఉద్యమం ఒక సునామీలా దూసుకుపోతున్న సమయం.. తెలంగాణలో ప్రతి గుండె ఉద్యమం కోసం స్పందిస్తున్న సమయం ఎక్కడ చూసినా గులాబీ జెండాల రెపరెపలు జై తెలంగాణా నినాదాలు... ఈ ఉద్యమాన్ని సాధ్యమైనంత తక్కువ చేసి చూపడానికి ఆంధ్రా మీడియా నానా తంటాలు పడుతున్న సమయం.. ఆ కీలక సమయంలో తెలంగాణా గుండె చప్పుడు వినిపించింది జీ ఇరవైనాలుగు గంటలు. మా ఛానల్ హెడ్ శైలేష్ రెడ్డి తో బాటు లీడింగ్ రోల్ లో ఉన్న మేమంతా తెలంగాణా వాదులమే.. అయినా మేమెక్కడా అతి చేయలేదు, లేని ఉద్యమాన్ని ఉన్నదన్నట్లు అబద్ధాలు ప్రసారం చేయలేదు. జరుగుతున్న పరిణామాలకు అద్దం పట్టాం.. ఉన్నది ఉన్నట్టే చూపించాం.. మా బాస్ శైలేష్ నాయకత్వంలో ఎవరికీ వీలైనంత వాళ్ళు ఉద్యమానికి బాసటగా నిలిచాం. ఇక్కడ ముఖ్యంగా కొంతమంది కొలీగ్స్ గురించి చెప్పుకోవాలి.
గురించి ప్రధానంగా.. తెలంగాణా ఉద్యమ తీరు తెన్నులను దగ్గరగా గమనిస్తూ శ్రీధర్ చేసిన విశ్లేషణాత్మక కథనాలు ఎంతో ఆసక్తిగా ఆలోచింప చేసేవిగా ఉండేవి.. శ్రీధర్ స్టోరీలకు అప్పట్లో నేను ఫ్యాన్ నే... ఇక మా
లయితే చిచ్చర పిడిగులే.. ఒక దశలో ఉద్యమ నాయకుల్లా కనిపించేవారు.. ఆ టైం లో క్రైమ్ బ్యూరో చీఫ్ గా నేను నా వంతు పాత్ర పోషించాను. జెండాలు పట్టలేదు, నినాదాలు చేయలేదు గానీ నా స్ట్రింగర్స్ టీమ్ ను ఉద్యమానికి అంకితం ఇచ్చేసాను. ఏ గల్లీలో ఏం జరిగినా మా లోకల్ రిపోర్టర్స్ వెంటనే విజువల్స్ పంపేవారు, అవి వెంటనే టెలికాస్ట్ అయ్యేలా చూసే వాడిని. సాయంత్రం ఏడుగంటలకు నాది హైదరాబాద్ బులెటిన్ ఉండేది.. ఆ బులెటిన్ నిండా ఉద్యమవార్తలే..
ఈ బులెటిన్ లో నేను రాసిన ఉస్మానియా తల్లి కన్నీరు పెడుతోంది అనే స్టోరీ ఒక సంచలనమే రేపింది.ఒకవైపు శ్రీధర్ విశ్లేషణలు, వాసు విజయ్ ల స్పెషల్ స్టోరీలు, నా టీమ్ తెచ్చే ఎక్స్ క్లూజివ్ విజువల్స్, దానికి మా డెస్క్ దిద్దే మెరుగులు.. ఛానల్ అంతా తెలంగాణా మయంలా కనిపించేది.డెస్క్ లో GOPALA
లు తెలంగాణా వాదులే.. మిగతా ఛానల్స్ తప్పదన్నట్టుగా మొక్కుబడి వార్తలు వేసేవారు.అయితే ఈ వ్యవహారం మాకు కొంత ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. ముఖ్యంగా శైలేష్ పై తీవ్ర ఒత్తిడి ఉండేది. కాంగ్రెస్, టిడిపి నేతలు సుభాష్ చంద్ర లెవెల్ లో లాబీయింగ్ చేసి శైలేష్ పై ఒత్తిడి తెచ్చారు. మేము ఆఫీసులో తెలంగాణా వాదులమే అయినా ఆంధ్రా ఉద్యోగులతో స్నేహంగానే ఉండేవాళ్ళం.. అయితే కొందరికి మా వ్యవహారం నచ్చక ఆంధ్ర వెబ్ సైట్లలో ఏవో పిచ్చి రాతలు రాసేవాళ్ళు. అవి చూసి నవ్వుకున్నాం గానీ ఎవరినీ పల్లెత్తు మాట కూడా అనలేదు. మా పని మేము చేసుకుంటూ పోయాం.. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మా నాగరాజుMnr mమాతో చాలా స్నేహంగా ఉండేవాడు. ఎందుకంటే మేము అబద్ధాలు చెప్పలేదు ఉన్నదే చూపించాం.. మిగతా చానల్స్ చూపకపోతే అది మా తప్పు కాదు కదా. ఈ క్రమంలో చాలా ఘోరాలు చూసాం.. ఉస్మానియా గుండెలపై లాఠీల గాయాలు చూసాం.. ప్రముఖ నేతల అరెస్టులూ చూసాం.. పోలీసు దెబ్బలకు గాయపడిన మీడియా సిబ్బందిని చూసాం.. పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన మా రిపోర్టర్
ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాడు.. ఇవేకాకుండా లగడపాటి కుప్పిగంతులు చూసాం.. తెలంగాణా ఉద్యమకారులపై లాఠీ చార్జి చేసిన కరుడుగట్టిన సమైక్య వాది దానం నాగేందర్, తెలంగాణా లేదు ఏమీ లేదంటూ గూండాయిజానికి దిగిన తలసాని శ్రీనివాస యాదవ్ వీరంగమూ చూసాం..వీరంతా ఇప్పుడు అధికారపక్షంలో భోగాలు అనుభవించడం మనకు అనవసరం. దాన్ని కేసీఆర్ విజ్ఞతకే వదిలేద్దాం.. అయితే తెలంగాణ ఉద్యమాన్ని భుజాన మోసిన జీ ఇరవైనాలుగు గంటలు కనుమరుగయ్యే దశకు చేరుకున్నా దాన్ని కాపాడుకునేందుకు తెరాస నాయకత్వం ముందుకు రాలేదు. ఛానెల్ మూతపడటంతో ఉద్యోగులందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయారు. ఎవరైనా లబ్దిపొందారంటే అది వారి వ్యక్తిగత పరిచయాల ప్రభావమే.. అయితే తెలంగాణ ముద్ర పడినందుకు మేమెప్పుడూ గిల్టీగా ఫీల్ కాలేదు ఉన్నదే చూపించాం.. దానికి తోడు మా నరనరానా ఉన్నది తెలంగాణా వాదమే. ఇది ఏమాత్రం తప్పు కాదని నా అభిప్రాయం.. సమైక్య ఆంధ్రా ఉద్యమాన్ని వేరే చానల్స్ నెత్తిన మోయలేదా? సమైక్య ఉద్యమమంటే ఒక విషయం గుర్తుకు వచ్చింది. అప్పట్లో నేనూ మా వాణీ కలిసి వైజాగ్ వెళ్లాం.. అప్పుడు సమైక్య ఉద్యమం నడుస్తోంది.. మార్గం మధ్యలో విజయవాడ దగ్గర ఏదో హడావిడి కనిపిస్తే జర్నలిస్టు బుద్ధి కదా కొంచెం అటువైపు దృష్టి సారించాం.. కొన్ని ఆటో యూనియన్లు, కొంతమంది స్కూల్ పిల్లలతో కలిసి అక్కడ లగడపాటి ధర్నా చేస్తున్నారు.. మొత్తం కలిపి ఓ రెండొందల మంది ఉండవచ్చు.. మరుసటి రోజు పేపర్లో వార్త ఏంటో తెలుసా స్థంభించిన బెజవాడ అని.. ఇలా ఉండేది మీడియా తీరు. నిజానికి సమైక్య ఆంధ్రా ఉద్యమం ప్రజల్లో నుంచి రాలేదని నా అభిప్రాయం. ఒకవేళ అది ప్రజా ఉద్యమమే అయితే గనుక ఈ రోజు ఆంధ్ర రాజకీయాలలో కొత్త నాయకత్వం ఉండేది. సరే ఈ విషయం అలా వదిలిస్తే తెలంగాణా జెండాలు మోసిన మా ఛానల్ కు ఒరిగిందేమి లేదు.. అన్యాయంగా మూతపడినా తెలంగాణా వాదం మాకు ఇచ్చింది ఏమీ లేదు. నేను ఇప్పటికీ తెలంగాణా వాదినే కానీ తెరాస వాదిని కాదు. ఎందుకంటే తెరాస వాదమే తెలంగాణా వాదమంటే నేను మాత్రం ఒప్పుకోను..

21 comments:

  1. తెలంగాణా వాదాన్ని అణగదొక్కేందుకు ఆంధ్ర పాలకులు ప్లస్ మీడియా మాఫియా వేసిన కుట్రలకు ఎదురొడ్డి నిలబడిన రామచంద్రమూర్తి, అల్లం నారాయణ, పొత్తూరి వెంకటేశ్వర రావు, శైలేష్ రెడ్డి, పాశం యాదగిరి, దేవురపల్లి అమర్, కట్టా శేఖర్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్ వంటి అనేకానేక జర్నలిస్టు మిత్రులందరికీ వందనాలు.

    Hats off to the Telangana pen warriors!

    ReplyDelete
  2. అన్నిరకాల ఇజాలూ వాదాలూ సానుభూతిపరులనీ అనుచరుల్నీ పుష్కలంగా తయారుచేస్తాయి. కాని అంతిమంగా లబ్ధి పొందే నాయకత్వాలు తమ లాభనష్టాలనే లెక్కవేసుకుంటాయి కాని వీరందరినీ కాదు. చీకటి కోణాలు ఉద్యమాల్లోనూ మీడియాలోనూ కూడా సహజమే.

    ReplyDelete
    Replies
    1. నిజమే సర్.. నాయకత్వాలే లబ్దిపొందుతాయి
      థాంక్యూ సర్..

      Delete
    2. తెలంగాణా అంటే గిట్టని కొందరు ఆంధ్రులు రాష్ట్రం కరెంటు లేక అంధకారం అవుతుందని, నక్సలైట్లు/మతకల్లోలాలు చెలరేగిపోతాయని, దేశం జిల్లాకో రాష్ట్రం చప్పున విడిపోతుందని ఇంకా ఏవేవో చీకటి కోణాలు జోస్యం అప్పట్లో చెప్పారు. అవన్నీ కట్టుకథలని రుజువు అయ్యాక కూడా ఇంకా ఎందుకు ఆ వితండవాదం? ఇంకా ఉద్యమం మీద విషం కక్కడం అవసరమా?

      ఉద్యమ ఆకాంక్షలతో ఉదయించిన తెలంగాణా రాష్ట్రం అల్లం నారాయణ, శైలేష్ రెడ్డి, పాశం యాదగిరి, చంటి క్రాంతి కిరణ్ వగైరా ఎందరో ఉద్యమకారులకు (ఆసక్తి ఉంటే తెలుగు బ్లాగర్లతో సహా ఇటువంటి ఉదాహరణలు డజన్ల కొద్దీ ఇవ్వగలను) కొద్దోగొప్పో గుర్తింపు ఇచ్చి వారి సేవలు వినియోగం చేసుకుంటుంది. కేవలం నాయకులకు మాత్రమే లబ్ది జరిగిందని వాదించడం అర్ర్దరహితం, అసంబద్ధం & అవివేకం.

      Delete
    3. నేనెక్కడ విషం చిమ్మానండి సారో.. ఎవరినీ వ్యక్తిగతంగా ఏమీ అనలేదే.. నిజమే ఎక్కడైనా నాయకత్వాలు కొంత లబ్ది పొందుతాయి.. నో డౌట్.. కానీ వారికి ఉన్న వ్యక్తిగత సంబంధాలే ఇందుకు దోహద పడతాయి.. ఏమండీ తలసాని దానం లు తెలంగాణా వాదులా నేను వారి గురించే కదా అన్నాను. వంద కాదు లక్ష బ్లాగుల్లో రాయండి సార్.. ఎవరు ఎవరిని ఆపగలరు..

      Delete
    4. నేను మిమ్మల్ని ఏమీ అనలేదు సార్.

      ఒక మహోన్నత గమ్యం కొరకు కొట్లాడుతున్నవారు "లబ్ది" ఆశించరు. దశాబ్దాల చారిత్రిక పోరాటంలో తమ వంతు పాత్ర పోషిద్దామనే వాళ్ళ తండ్లాట. ఉద్యమ విజయం పిమ్మట వారికి "పదవులు" దక్కాయా లేదా అన్న దృష్టికోణం సరికాదు.

      జర్నలిస్టులు, కళాకారులు, రచయితలు, బ్లాగర్లు ఇట్లా అనేకరంగాలలో తెలంగాణా కొరకు సిన్సియరుగా ఉద్యమించిన వారిలో పలువురికి సముచితస్థానం ఇచ్చి, వారి సేవలు తెలంగాణా పునర్నరిర్మాణంలో ఉపయోగించుకోబడుతున్నాయి. కొందరు పాత్రికేయుల పేర్లు రాసి, ఇంకా డజన్ల మహనీయుల ఉదాహరణలు ఉన్నాయని నేను రాసినప్పుడు "నేను వంద బ్లాగుల్లో రాస్తాను" అన్నట్టు మీనింగ్ వచ్చిందేమో, sorry for the confusion in my comment.

      తలసాని & దానం వంటి వారి గురించి మీతో పూర్తిగా ఏకీభవిస్తాను కానీ తెలంగాణా వ్యతిరేకులు మాత్రమే అందలం ఎక్కిన అప్పటి రోజుల కంటే ఇప్పుడు ఎంతో నయం కదా. ఆ రోజున మనల్ని పట్టించుకునే నాథుడే లేదు, ఇయ్యాల ఎవరో కొద్ది మంది తప్పవిడిచి మనోళ్లే.

      Delete
    5. "అల్లం నారాయణ, శైలేష్ రెడ్డి, పాశం యాదగిరి, చంటి క్రాంతి కిరణ్"

      "అల్లం నారాయణ, శైలేష్ రెడ్డి, ఘంటా చక్రపాణి, చంటి క్రాంతి కిరణ్" అని సవరించ మనవి.

      పొరబాటున ఘంటా చక్రపాణి అనబోయి పాశం యాదగిరి పేరు రాసాను.

      Delete
    6. ఎస్ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను
      ధన్యవాదములు సర్...

      Delete
  3. శ్యామలీయం: .... చీకటి కోణాలు ఉద్యమాల్లోనూ మీడియాలోనూ కూడా సహజమే.
    జై: తెలంగాణా అంటే గిట్టని కొందరు ఆంధ్రులు రాష్ట్రం కరెంటు లేక అంధకారం అవుతుందని .... ఇంకా ఏవేవో చీకటి కోణాలు జోస్యం అప్పట్లో చెప్పారు. అవన్నీ కట్టుకథలని రుజువు అయ్యాక కూడా ఇంకా ఎందుకు ఆ వితండవాదం? ఇంకా ఉద్యమం మీద విషం కక్కడం అవసరమా?
    జై గారూ, నేను తెలంగాణా ఉద్యమాన్ని గురించి నా వ్యాఖ్యలో ప్రస్తావించ లేదు. మరి మీరు "గిట్టని కొందరు ఆంధ్రులు", "వితండవాదం", "ఉద్యమం మీద విషం కక్కడం" వంటి మాటలు ఎందుకు అంటున్నారో బోధపడటం లేదు. చీకటికోణం అనగానే కరెంటు గురించి ప్రస్తావన అని సాగదీస్తే ఎట్లా? ఆమాటకున్న అర్ధం మీకు తెలియనిది కాదే! సరే, మీరు తవ్వి తలకెత్తుకున్నారు కాబట్టి అడుగుతున్నాను. తెలంగాణా ఉద్యమంలో ఎక్కడా చీకటికోణాలు లేనేలేవని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? ఏదో‌ రకంగా, ఆంద్రులనూ‌ ఆంధ్రామూలాలున్న ప్రవాసాంధ్ర వ్యక్తులందరినీ నిత్యం శంకించటం మీలాంటి మేధోవంతులకు శోభిస్తుందని అనుకోను.

    ReplyDelete
  4. తెలంగాణ శాంతియుత విధానాలతోనే సాధ్యమయ్యింది.. ఇప్పుడు పాత విషయాలు వద్దు. శాంతిని పాటిద్దాం...

    ReplyDelete
  5. @శ్యామలీయం:

    నేను "గిట్టని కొందరు ఆంధ్రులు" అన్నప్పుడు అక్కడ "గిట్టని" & "ఆంధ్రులు" అని మాత్రమే కాదు, "కొందరు" కూడా ఉంది. ఈ *కొందరు* కూడా మీడియా/రియల్ ఎస్టేట్/సినిమా/రాజకీయ రంగాలకు చెందిన/ప్రభావితమయిన వ్యక్తులు మాత్రమే.

    తెలంగాణా ఏర్పడితే ఏవేవో విపరీతాలు జరిగిపోతాయని మీడియాలో, బ్లాగులలో ఎంతెంతమంది శాపనార్ధాలు, గావు కేకలు & పెడబొబ్బలు పెట్టిన విషయం తమకు విదితమే. అందుట్లో *ఒక్కటి* కూడా సత్యం కాదన్నది స్పష్టమే కాదంటారా.

    నాకు ఆంధ్ర నలుమూలలా బంధుమిత్రులు ఉన్నారు. ఎవరితోనూ పేచీ లేదు, ఎవరిమీదా కోపం లేదు.

    ఇక "చీకటి కోణాలు" భూతద్దంలో వెతికివెతికి పట్టుకుందామంటే నేనేమీ చేయలేను. నకారాత్మక దృక్పధం విడనాడి కండ్ల ముందున్న కాంతిని, క్రాంతిని చూడగలిగితే సంతోషం.

    @ghousuddin shaik:

    నేనంటున్నది కూడా దాదాపు అదే. మహోన్నత ఉద్యమం విజయవంతమైనాక కూడా *కొందరు* ఇంకా తెలంగాణను ఆడిపోసుకోవడం దురదృష్టం.

    ReplyDelete
  6. // “ ఏదో‌ రకంగా, ఆంద్రులనూ‌ ఆంధ్రామూలాలున్న ప్రవాసాంధ్ర వ్యక్తులందరినీ నిత్యం శంకించటం మీలాంటి మేధోవంతులకు శోభిస్తుందని అనుకోను.” //

    శ్యామలరావు గారు,
    ఇదంతా చర్వితచర్వణమే కదా? అయినా ఇటువంటి చర్చలోకి మాటిమాటికీ ఎందుకు ప్రవేశిస్తారు మీరు? అవసరమా?

    ReplyDelete
  7. గౌసుద్దీన్ గారు,

    శాంతివిఘాతకారకమైన మాటలేవీ నేను అనలేదు. అది స్పష్టం. అనని మాటలకు నిందమోయవలసిన అగత్యం కూడా లేదు.

    ఇలా లేనిపోని అర్ధాలు తీసే మహత్ముల వలననే శాంతి భగ్నమైనందుకు నేనేమీ‌ చేయలేను.

    ఇది ఒక పధ్ధతిప్రకారం‌ జరుగుతున్నది. ఆంధ్రమూలాలున్న వ్యక్తులు ఏం మాట్లాడినా అందులో ఎలాగోలా పెడర్దాలు త్రవ్వి తీసి తెలంగాణపట్ల ద్వేషాన్నే‌ చూపుతున్నారని మాటలనటం కొత్తగా చూస్తున్న సంగతి కాదు. దీని వెనుక ప్రథానోద్దేశం ఐతే మాలాంటి అంధ్రామూలాల వారము ఎక్కడా కనబడకూడదు లేదా వీరి దారి లోకి వచ్చి మేమూ తెలంగాణాద్రోహుల్ని ఇలాగే ఊహించి వెంటాడుతూ వీరికి తృప్తి కలిగిస్తూ ఉండాలి. ఇలా బ్లాగ్ స్పేస్ అంతా వీళ్ళే దున్నేస్తూ ఉండాలి. చాలా బాగుంది!!

    విరక్తి కలుగుతోంది.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ, విన్నకోట వారూ,
      కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానుల్ని గురించి కరటక శాస్త్రి తన చెల్లెలితో
      ఏమన్నాడో గుర్తుందా? ఓ సారి గుర్తు తెచ్చుకుంటే ఆ విధంగా ముందుకు సాగిపోవాలని అనిపించదూ?!

      Delete
    2. గుర్తుంది, సూర్య గారూ. అదే గత్యంతరం అనిపిస్తోంది. థాంక్స్.
      మా డిగ్రీ చదువులో ఇంగ్లీషు లెక్చరర్ గారు చివరలో వీడ్కోలు క్లాసులో ఒక సలహా ఇచ్చారు .... జీవితంలో సాంత్వన నిచ్చేది సాహిత్యమే (literature); అందువల్ల ఏదో పరీక్షలు అయిపోయాయి కదా అని literature ని వదిలెయ్యకండి. ఆయన చెప్పిన మాటలు అక్షరసత్యాలు 🙏

      Delete
  8. మీ అందరికీ దండం పెడతాను.. నా బ్లాగ్ ను విభేదాలకు వాడుకోకండి.. నేను రాసింది నచ్చితే ఒక కామెంట్ పడేయండి. బాగుందో బాలేదనో.. అంతే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బతీయొద్దు.. ఎందుకంటే ఎవరి వాదనలో అయినా ఎంతో కొంత పాయింటు ఉంటుంది.. తెలంగాణా, ఆంధ్రా రెండు ప్రాంతాల ప్రజలు అమాయకులే.. రాజకీయాల్లో పావులే.. రాజకీయాలకు అతీతమైనది నా బ్లాగ్... దయచేసి వివాదాలకు దీన్ని వాడుకోకండి.. ఎవరూ చదవకున్నా పరవాలేదు కానీ ఇక్కడ భావ హింస వద్దు.. ప్లీస్..

    ReplyDelete
  9. ఒకే అంశం పై వివిధ వ్యక్తుల భిన్న వాదనల గురించి rashomon చిత్రం ఉదహరిస్తూ హిందూ పత్రిక లో క్రింది పేరా మధుమతి అనే ఆవిడ మాటల్లో. ..


    In real life too, I believe there is more than one truth. Let us say there is an argument between a husband and wife. It is not a question of who is right, but a question of one’s perspective versus the other’s. In fact, my life policy came from Rashomon: that you can tell stories in so many different ways and everybody will have their own version.

    ReplyDelete
    Replies
    1. అవునండీ నిజమే
      ధన్యవాదములు 🙏

      Delete
  10. భూమి పై జన్మ పొందేవారందరికి అమ్మ నాన్నలు ఉంటారు అనేది ఎంత నిజమో.. ఎంతటి వాస్తవికతో.. అందుట్లో ఒక నానుడిలా.. జిహ్వా కో రుచి పుఱ్ఱె కో బుద్ధి.. ఒక వస్తువును కాని ఒక సందర్భాన్ని కాని మనం తీసుకున్నట్లైతే.. ఆయా సందర్భం కొందరికి సాపేక్షకంగా అగుపించ వచ్చు మరి కొందరికి దాని వలన కలిగే లాభ నష్టాలేమి ఉండకపోవచ్చు..
    హౌ వన్ రియాక్ట్స్ టూ ఏ సిటువేషన్ ఇజ్ దీ లెవల్ యాండ్ డిగ్రీ ఆఫ్ పర్సెప్షన్.. !

    ReplyDelete
  11. నిజం... నేనైతే పూర్తిగా ఏకీభవిస్తాను..

    ReplyDelete