Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 7 August 2020

మారదు నా హృదయం..


మారదు నా హృదయం..

ఎన్ని రాత్రులు కంటి ధారలు ఇంకిపోలేదు
ఎన్ని అవమానాల అవహేళనలు తట్టుకోలేదు
ఎన్ని తూఫానులు ముంచెత్తలేదు
ఎన్ని సుడిగుండాల్లో మునిగి తేలలేదు
ఎన్ని దారుల రుధిరం కారలేదు
ఎన్ని చీకట్లు అలుముకోలేదు
ఎన్నిసార్లు పడుతూ లేస్తూ
నడవలేదు
మారిందా నా గమ్యం
చెదిరిందా నైజం
దేవుడు ఏమట్టితో చేసాడో గానీ
కరగదు
తరగదు
పెరగదు
అసలు మారనే మారదు
నా హృదయం...

No comments:

Post a Comment