Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 19 August 2020

యుద్ధం చేస్తూనే ఉంటా..


యుద్ధం చేస్తూనే ఉంటా..

నేను యుద్ధం చేస్తూనే ఉంటా
లక్షల సార్లు ఓడిపోతూనే ఉన్నా...
నేను నడుస్తూనే ఉంటా
మార్గాలన్నీ మాయమవుతూనే ఉన్నా...
నేను శ్వాస తీసుకుంటూనే ఉంటా
నా ఊపిరి నాకు దూరంగా పారిపోతూనే ఉన్నా...
నేను జీవిస్తూనే ఉంటా
నా వీపుపై పిడిబాకులు దిగబడుతూనే ఉన్నా...
నేను చిరునవ్వులు చిందిస్తూనే ఉంటా
నా గుండెలో అగ్ని రగులుతూనే ఉన్నా...
నేను సువాసననై పరిమళిస్తూనే ఉంటా
కాగితం పూలు నా చుట్టూ ఎన్ని ఉన్నా...
నేను నాలాగే ఉంటా
ఎవరు ఎన్ని కోణాల్లో నన్ను చూసినా...
నేను మారని మనిషిని
అలుపెరుగని సేనానిని
యుద్ధం చేస్తూనే ఉంటా
మరణం నన్ను గెలిచేదాకా...

4 comments:

  1. మీ కవిత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు సర్..
      కామెంట్ చేసినందుకు
      🙏🙏🙏🙏🙏

      Delete
  2. Replies
    1. ధన్యవాదములు అండీ

      Delete