Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 17 August 2020

అంతా నేనే కదా..


అంతా నేనే కదా..
హిమమువో
నీవు
సుమమువో
నా గుండెను తాకిన
శరమువో...
పువ్వును తాకిన
చిరుగాలివో
వీణ మీటిన
తీయని రాగానివో
నా మదిన ప్రకంపనలు రేపిన అందియల రవళివో...
నీవు మంచు కెరటానివో
అందమైన పుష్పానివో
చిరుగాలి సవ్వడివో
ప్రణయరాగానివో...
నిన్ను శోధిస్తున్నా
నీలో నిన్ను వెతుకుతూనే ఉన్నా...
ఎందుకో గానీ
నిన్ను చదువుతున్న కొద్దీ
నీలో నేనే కనిపిస్తున్నా
మనస్వినీ...

No comments:

Post a Comment