ఐ డోంట్ కేర్
ఐదు పదుల మైలురాళ్ళను ఆడుతూ
పాడుతూ దాటలేదు నేను.
ఊహా తెలిసిన నాటి నుంచి
ప్రతి క్షణం పోరాటంతోనే సాగింది.
ఎందుకంటే నేను గోల్డెన్
స్పూన్ తో పుట్టలేదు. తాత ముత్తాతల ఆస్తి పాస్తులు వారసత్వంగా రాలేదు. ప్రతిదినం వేదన,
అవహేళన అవమానాలను దిగమింగుకుని పేదరికం స్థాయినుంచి మధ్యతరగతి స్థాయికి ఎగబాకాను. ఎవడిని
ముంచకుండా ఎవడి మీద ఆధారపడకుండా ఒక వైభవంగా ఎదిగాను. ఎన్ని మలుపులు చూడలేదు ఎన్ని కుట్రలు
అనుభవించలేదు అన్నీ జరిగాయి. మనుషుల్ని చూసాను మనుషుల మనసుల్ని చూసాను మనసుల మతలబులూ
చదివాను. అన్నీ తట్టుకుని శిఖరమై నిలిచాను. నన్నెవరూ ఏమీ చేయలేకపోయారు. నా వైభవశిఖరాన్ని
నేనే కుప్పకూల్చుకున్నా.. ఇప్పుడు కూడా అంతే నన్ను తొక్కేవాళ్ళు నన్ను నాశనం చేసేవాళ్ళు
పుట్టలేదు. ఏం చేసుకోవాలన్నా నన్ను నేనే... ఇంతకన్నా ఏం జరుగుతుంది. జరిగితే జరగనీ..
ఇన్ని తట్టుకున్నోడిని ఈ జీవితం చేస్తున్న తాటాకు చప్పుళ్లకు బెదురుతానా!!!
ఐ డోంట్ కేర్..
No comments:
Post a Comment