ప్రకృతివరం లక్నవరం..
అక్కడ అడుగు పెట్టగానే
ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది.. నాలుగువైపులా ఎత్తన కొండలు... మధ్యలో నిండుకుండలా
అందమైన సరస్సు... అక్కడక్కడా విసిరేసినట్లుగా కనిపించే అందమైన దీవులు.. పకృతి కాంత
పచ్చ ముసుగు వేసుకుందా అనిపించేలా ఆకుపచ్చ అందాలు... ఉషస్సువేళ సరస్సును ముద్దాడే భానుడి
వెండి కిరణాలు... వీనుల విందైన పక్షుల కువకువలు... ఎంత ముచ్చటైన భానోదయం... వరంగల్
కు సమీపంలో గోవిందరావుపేట మండలం పరిధిలో సుమారు పది ఎకరాల వైశాల్యంలో అందమైన పదమూడు
దీవులతో ప్రకృతి కాంత సొగసులో మణి మకుటంలా విరాజిల్లుతున్న లక్నవరం సరస్సు అందచందాలు
ఇవి...
అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది
అవును అక్కడే ఉండిపోవాలని
అనిపిస్తుంది. మొదటిసారి లక్నవరం నేను మా వాణితో కలిసివెళ్ళా.. అప్పుడు కాళేశ్వరం వెళ్లి
తిరిగివస్తూ లక్నవరం వెళ్లాం.. నేనే కార్ డ్రైవ్ చేసి ఉండటం వల్ల ఆలసట అనిపించటం..
అప్పటికే సాయంత్రం కావడం వంటి కారణాలతో అక్కడ
ఎక్కువ సేపు ఉండలేదు. కానీ అక్కడ ఉన్నంతసేపు మేము ఏదో వేరే లోకంలో ఉన్నట్టు ఫీల్ అయ్యాం...
కానీ సమయం అంతగా లేకపోవటం కారణంగా తొందరగానే తిరిగి వచ్చేసాం మళ్ళీ రావాలనే బలమైన కాంక్షతో...
అనుకోకుండా పదిరోజుల వ్యవధిలోనే ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ లక్నవరం చేరుకున్నా.. ఒకరోజు
స్టే చేసాం అక్కడ.. ఇక్కడ ఉషోదయం ఒక అద్భుతం.. పర్యాటక శాఖ నిర్మించిన రోప్ వేలు ఇక్కడ
ప్రధాన ఆకర్షణ.. నీటిలో విన్యాసాలు చేసే స్పీడ్ బోట్లు చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది.
ఎంట్రెన్స్ లో మొదటి దీవిపై అందంగా నిర్మించిన హరిత కాటేజీల్లో బస చేయడం ఒక అందమైన
అనుభవం.. అన్నింటికి మించి ప్రకృతి ఒడిలో సేద తీరాలనే మనసున్నవారికి ఇదో అందమైన అనుభవం..
హైదరాబాద్ నుంచి లక్నవరం కారులో వెళ్లాలంటే వరంగల్ లోకి ఎంటర్ కాకుండా నేరుగా ములుగు
రోడ్డుపైనుంచి వెళ్ళవచ్చు.. మెయిన్ రోడ్డు పై చలవాయి ఏరియానుంచి రైట్ టర్న్ అయితే అక్కడికి
చేరుకోవచ్చు. దాదాపు ఐదారు కిలోమీటర్లు మాత్రం గతుకులతో కూడిన ఘాట్ రోడ్డు ఉంటుంది.
కానీ అక్కడ అడుగు పెట్టగానే అన్ని మర్చిపోతాం. అయితే స్టే చేయాలనుకుంటే మాత్రం ఆన్
లైన్ లోనే రూమ్ బుక్ చేసుకోవాలి. కాదనుకుంటే ఉదయం వెళ్లి సాయంత్రం దాకా హాయిగా ఎంజాయ్
చేయవచ్చు.. నేనైతే మళ్ళీ వెళతా ఖచ్చితంగా... ఎందుకంటే ప్రకృతి కాంత చేతులు చాచి మరలా
మరలా రమ్మంటోంది మరి. నేను ప్రకృతి ప్రేమికుడినేగా
ప్రేయసిని చేరకుండా ఉండగలనా...
ఎందుకంటే అక్కడ చూడాల్సింది
ఇంకా చాలానే ఉంది ❤️
Last photo super.
ReplyDeleteఅంతేనండీ అంతే....
Deleteనా ఫోటోలు బాలేవనేగా...
కానీయండి ఏం చేస్తాం...