పవిత్రగ్రంధం
నవ్వించేందుకు నేను జోకర్ని
కాదు
ఏడిపించేందుకు నేను శాడిస్టును
కాదు
రాళ్లు వేసేందుకు నేను
పిచ్చివాడిని కాదు
మెప్పించేందుకు నాదగ్గర
లౌక్యమూ లేదు
నాకంటూ ఉన్నవి నా అక్షరాలు
మాత్రమే
నా భావాల సిరాలో అక్షరాలను
ముంచి
మనసు పుస్తకంలో దాచుకుంటూ
ఉంటా
ఎవరికి అర్ధమైనా కాకున్నా
ఎందుకంటే
నా మనసు పుస్తకమే నాకు
పవిత్రగ్రంధం..
Well presented. Great
ReplyDeleteఒక చేతి వేళ్ళే భిన్నమైనపటికీని అవన్ని కలసికట్టుగా ఉంటాయి
ReplyDeleteఅక్షరాల ఆకారాలన్ని బిన్నమైనపటీకీని వాటి భావం ఒకటిగా ఉంటాయి
అలానే భావాల లోగిలిలో అక్షరాల మేళవింపు
భావాల కీకారణ్యంలో అక్షరాల వెలుగులు
ఘౌస్ జీ.. ఆప్కే ద్వారా లిఖి గయి అర్థ్-ఎ-అక్షర్ అక్సర్ సహి బాత్ కో ఫర్మా రహి హై..
ఖుదా హఫీజ్.. షబ్బ ఖైర్
షుక్రియా జీ 🙏
Delete