హల్లాబోల్ ఢిల్లీ
అవి ట్రాక్టర్ లా యుద్ధ ట్యాంకులా!!!
అవును రైతులు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని గడగడలాడిస్తున్న అన్నదాతలు ఈసారి ఇరవై ఆరవ తేదీన ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై యాభైకిలోమీటర్ల పొడుగునా నిర్వహించనున్న ట్రాక్టర్ ర్యాలీకి భారీ యుద్ధసన్నాహాలు చేస్తున్నట్టే ఉంది. వందలాది ట్రాకర్లను యుద్ధ ట్యాంకర్లుగా మార్చేశారు. ఈ ట్యాంకర్లు ఎలాంటి బారికేడ్లనైనా తుత్తునియలు చేయగలవు. పోలీసుల లాఠీ చార్జిని ఎదుర్కొనేందుకు వీలుగా బలమైన ఇనుప జాలీల రక్షణ వ్యవస్థ వీటి ప్రత్యేకత. వేలాదిగా తరలివస్తున్న ట్రాక్టర్లలో దాదాపు ఐదువందల వాహనాలను ఈ విధంగా తీర్చిదిద్దారు. ర్యాలీలో ఈ ట్రాక్టర్లే ముందువరుసలో ఉండబోతున్నాయి. అంటే ఈ ర్యాలీ ఔటర్ రోడ్డుకే పరిమితం అవుతుందా? అన్నదాతల ఆక్రోశం ఆగ్రహంగా మారితే ఢిల్లీ పరిస్థితి ఏంటి?
చట్టాలు మంచివా కాదా అని నేను మాట్లాడటం లేదు. ఆందోళన చేస్తున్నవారివెనుక ఎవరున్నారనే చెత్తవాదన చేయను. అన్నదాతలు చిన్నపిల్లలు కాదు ఎవరో ఆడిస్తే ఆడటానికి. పంజాబీ పులులు ప్రారంభించిన ఈ ఉద్యమం అదుపు తప్పితే అది రైతుల తప్పు కాదు. పాలకులే దీనికి బాధ్యత వహించాలి.దేశంలో ఇంత జరుగుతున్నా మోడీమీడియా కు పట్టకపోవటం మరో దారుణం..
https://youtu.be/Ud9TfKSBgT4
ReplyDelete