మనస్విని లేదు....
వికలమైన మనస్సుతో
రాసుకుంటున్నా ఈ అక్షరాలు...అవును మనస్విని లేదు..
గతంలోనూ చెప్పాను. ఇప్పుడూ చెబుతున్నాను..మనస్విని ఒక ఊహా
మాత్రమే...నా రాతలతో ఎవరికీ ఎలాంటి సంబంధం లేదు..భావకుడి భావనలన్నీ ఊహలే తప్ప
వాస్తవాలు కాదని ఇదివరకే చెప్పాను..అయినా నా రాతలను నా వ్యక్తిగత జీవితానికి
ముడిపెడుతున్నారు కొందరు..ప్రపంచంలో నిత్యం కనిపించే పాత్రలతో మమేకమై వాటిలో పరకాయ
ప్రవేశం చేసి కొన్ని పిచ్చిరాతలు రాసుకున్నా..అవన్నీ నావే అనుకుంటే ఎలా...?
అవును
అన్నీ అబద్దాలే..ఏవో రాసుకున్నా...వీక్షకులను పెంచుకోవాలని తపించా..కానీ ఇలా
జరుగుతుందని అనుకోలేదు..నా జీవితంలో మనస్విని అనే పదానికి ఎవరితోనూ సంబంధం
లేదు..దయచేసి ఊహాగానాలు వద్దు..మళ్ళీ మళ్ళీ చెబుతున్నా చేతులు జోడించి
నమస్కరిస్తున్నా .. మనస్విని ఒక కవితా వస్తువు మాత్రమే...ఎవరితోనూ లింకు
పెట్టవద్దు..అందుకే భారమైన మనస్సుతో నిర్ణయం తీసుకున్నా...
మనస్వినినే త్యజిస్తున్నా..
