Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 13 May 2021

మై డియర్ ఆర్గాన్స్

మై డియర్ ఆర్గాన్స్


ఓ హార్ట్ ఎట్టాకూ

తొందర పడమాకు

ఓ మధు మేహమా

మరి కొన్ని మాసాలు ఆగు

నా కాలేయమా

ఇంకా డ్యూటీ చేయ్

ప్రియమైన కిడ్నీలూ

జస్ట్ కొన్ని రోజులు పని చేయండి

మై డియర్ ఆర్గాన్స్

ఇప్పుడు మీ టైం బాగోలేదు

మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు

మీరు నన్ను చంపేసినా

అది కరోనా అక్కౌంట్ లో కలిపేస్తారు

జాగ్రత్త...


4 comments:

  1. అన్ని చావులనీ కట్టగట్టి కరోనా పద్దులో వేస్తోంది మన సభ్యసమాజం.
    కరోనా చావులా అబ్బే వేళ్ళమీద లెక్కట్టొచ్చు అంటోంది ప్రభుత్వం.

    ReplyDelete
    Replies
    1. ఏం జరుగుతోందో తెలియని అయోమయం సార్

      Delete
  2. శ్రీరంగం శ్రీనివాస రావు గారికి కృతజ్ఞత క్షమాపణలతో

    ఏ మెడికల్ రిపోర్ట్ చూసినా ఏమున్నది దృశ్యం
    కేస్ హిస్టరి సమస్తం సీఆర్‌పీ, సీబిపి, సీయూఈ లిఖితం
    ఏ హాస్పిటల్ కెళ్ళినా ఏమున్నది దృశ్యం
    బాధితులు సమస్తం ఆక్సిజెన్ అందక అయోమయం
    ఏ వ్యాధి వచ్చినా ఏమున్నది దృశ్యం
    కోవిడ్ ధాటికి అంతట అల్లకల్లోలం

    ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
    నరజాతి హాహాకారాలకు పెక్కుటిల్లేను ఉత్తరదక్షిణతూర్పుపడమరం

    జాగ్రత మన ఆరోగ్యం మన కవచం
    కవచం: సోషల్ డిస్టెన్స్, శానిటైజర్
    కుండలం: ఫేస్ మాస్క్

    ReplyDelete