Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday 20 October 2014

పున్నమి వెలుగువి.....



పున్నమి వెలుగువి.....
మనస్వినీ....
కనురెప్పలు వాల్చితే....
మెల్లగా కరుగుతున్న
వెలుగురేఖలు...
క్రమంగా అలుముకుంటున్న
నిశీధి నీడలు..
నల్లని రంగును అలుముకున్న ...
చీకటి తెరలను ...
చీల్చుతూ...
కనురెప్ప తెరలపై..
ఎదో కదులుతున్న ఆకారం...
కంటిపాపను తాకుతున్న..
ప్రతిబింబం...
క్రమంగా...
క్రమ క్రమంగా...
రూపుదిద్దుకున్న
ఓ రూపం...
ఏమిటా అని పరికిస్తే...
అది నువ్వే..
అవును నువ్వే...
నువ్వు నువ్వుగా..
చిరునవ్వులు చిందిస్తూ..
చీకటి తెరలతో..
దోబూచులడుతున్నావ్ ....
నీ నవ్వుల నుండి..
జాలువారుతున్న
వెన్నెల వెలుగులు..
చీకటి తెరలను...
తరిమేసి...
అందమైన నీ ముఖారవిందాన్ని...
నిండు చందమామలా...
పున్నమి వెలుగుల్లా...
ఆవిష్కరించాయి..
నా కనురెప్పల...తెరలపై..
కాంతులీనుతున్న..
నీ రూపం..
నిత్యం నా మనోఫలకంపై..
చెరగని ముద్ర...చూపుతూనే ఉంది..
అందుకే...
నిత్యం...
చిరునవ్వులు...
చిందించు...
మనస్వినీ......

No comments:

Post a Comment