Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Wednesday 29 October 2014

నిజమే....పాపం..బాపూజీ..ఆయన మళ్ళీ జన్మిస్తే...

పాపం గాంధీజీ...

నిజమే....పాపం..బాపూజీ..
ఆయన మళ్ళీ జన్మిస్తే...
క్షణం కూడా ఆలస్యం ...
చేయకుండా చచ్చిపోతాడు..
అవును మరి....
శాంతికి మారుపేరయిన...
మహాత్ముడి బొమ్మే 
సమాజంలో 
అల్లకల్లోలం సృష్టిస్తోంది...
చిద్విలాసం ఒలకబోస్తున్న ..
ఆయన బొమ్మ ఉన్న 
కరెన్సీ నోటు ..
సమాజంలో 
అన్ని రుగ్మతలకు 
కారణం అవుతోంది..
ఓ అన్న తమ్ముడినే 
ముంచేస్తాడు...
ఓ భర్త భార్యనే రోడ్డుపాలు చేస్తాడు...
తోడ బుట్టిన వాళ్ళు..
కుట్రలు కుతంత్రాలు చేస్తారు...
ప్రియుడు ప్రేయసికే గుడ్ బై చెబుతాడు...
ఓ మహా పతివ్రత 
ప్రాణంగా ప్రేమించే భర్త 
కళ్ళు గప్పి..
ఉన్న అపార్ట్ మెంట్ లోనే 
ఓ పెద్దాయనకు పరువాలు పంచేస్తుంది..
కట్టుకున్నోడు తట్టుకోలేక 
పరలోకానికి వెళ్ళిపోయినా 
బుద్దిమారదు...
కొందరయితే ఉన్నవాళ్ళనే చచ్చిపోయారంటారు..
పోయినవాళ్ళు ఇంకా ఉన్నారనే నమ్మిస్తారు..
తిమ్మిని బమ్మి చేస్తారు..
మనోభావాలతో ఆటలాడుకుంటారు..
అనుబంధం ఆత్మీయత...
వీళ్ళకుండదు ...
నిజానికి వీళ్ళ తప్పేమీ లేదు...
అంతా గాంధీ జీ పుణ్యమే...
గాంధీ జీ తప్పేమిటంటారా...
నిజమేగా ...గాంధీ గారి బొమ్మ 
ఉన్న పచ్చ నోట్లనే వీళ్ళు ప్రేమిస్తారు..
ఆ నోట్ల కట్టల ముందు..
అనుబంధం..ఆత్మీయత 
వీళ్ళకు కనిపించదు...
మరి తప్పెవరిది 
మనస్వినీ..

No comments:

Post a Comment