జస్ట్ విషెస్ ...
నీ అడుగులు సాఫీగా
సాగినా
తడబడి నడిచినా
మార్గాలు మారినా
గమ్యాలు చెదిరినా
నీ లక్ష్యం నేనే
నీ గమ్యం నేనే
నీ అడుగులు నడిచేది
నావైపే ...
కనురెప్పల్లో వెన్నెలే
కురిసినా
కంటి తెరలపై సుడులే
చెలరేగినా
ఆ కంటి పాపలలో
నిదురించేది నేనే ...
మనసు మానస సరోవరమైనా
మనోసంద్రంలో సునామీలే
చెలరేగినా
ఎగసిపడే అలల్లో
కనిపించేది నేనే ...
ఇంకా ఏమని చెప్పను నీ
గురించి
జస్ట్
హాపీ బర్త్ డే టూ యూ
మనస్వినీ ...
No comments:
Post a Comment