నా చరిత నువ్వే
నా చరిత నువ్వే
నీ మెడవంపున జారుతున్న
స్వేదబిందువులను
అమృత ధారలని తలచి
దాహార్తి తీర్చుకోనా...
ఎదపొంగుల ఆవిర్లను
ఊపిర్లుగా మలుచుకుని
జీవం పోసుకోనా...
సొగసు పూలను
అక్షరాలుగా చేసి
కవితలుగా అల్లుకోనా...
ఇంతకన్నా ఏం కావాలి నాకు
నీతో సాగిన పయనమే
నా చరిత్రయని రాసుకోనా...
అందమైన కవితలు ఎన్నో రాసేస్తూ అల్లుకోనా అని ప్రశ్నించనేల? :)
ReplyDelete