తెల్ల అక్షరాలు
కనులు మూసినా నలుపే
కనులు తెరిచినా నలుపే
నడిచే బాట నలుపే
నాలుగుదిక్కులూ నలుపే
విరిసే పుష్పం నలుపే
పువ్వుల తోటా నలుపే
బంధాలు నలుపే
రాబందుల నవ్వులూ నలుపే
మనుషులూ నలుపే
వారి మనసులూ నలుపే
స్నేహమూ నలుపే
స్నేహంలోని మర్మమూ
నలుపే
అడుగుల కింది నేలా నలుపే
తల ఎత్తిచూస్తే నింగీ
నలుపే
దేవుడా నాకేమీ వద్దు
కాసింత తెల్ల సిరా
ప్రసాదించు చాలు
నలుపెక్కిన నా జాతక
చక్రంలో
తెల్ల అక్షరాలు నేనే
రాసుకుంటా
No comments:
Post a Comment