ఎంత పిచ్చిది కదా మనసు
ఉషస్సు వేళ నీ తొలి
పలకరింపు
భానుడి పయనంతో నడిచే
ప్రతిఘడియలో నీ పలుకు
సంధ్య పులకింతలో
రేయిని
స్వాగతించే చల్లని నీ గుభాళింపు
అన్నీ నాకే ముందు
కావాలని
మారాం చేస్తోంది
మనసు...
చంద్ర వదన సింగారాలు
కనుల కొనలనుంచి
జాలువారే
వెన్నెల జలపాతాలు
కాటుక కంటిపై
అల్లుకున్న స్వప్నాలు
మేఘాలను అల్లే కురుల
వయ్యారాలు
నవ్వులు రువ్వే
మల్లికల సోయగాలు
పెదాలపై అద్దుకున్న
గులాబీల మిసమిసలు
పసిడిని మరిపించే
నిలువెత్తు ధగదగలు
అన్నీ నా
కనురెప్పలలోనే దాచుకోవాలని
మరో కంటినీడ కూడా
తాకరాదనీ
ఆరాటపడుతోంది నా
మనసు...
ఎంత పిచ్చిది కదా నా
మనసు
మనసులాగే
ఆలోచిస్తోంది...
No comments:
Post a Comment