మనసు కార్ఖానా
మనసు కార్ఖానా ఉందా
ఎక్కడైనా
తెలుసా దాని చిరునామా
ఎవరికైనా
మరమ్మత్తు చేసుకోవాలి
మనసుకు ఇకనైనా
మార్చుకోవడమే మంచిది
మనసును ఎందుకైనా
ఉన్నతంగా ఆలోచించమంటే
వినదు ఎంతైనా
మామూలు మనసునే అంటుంది
ఎప్పుడైనా
పిచ్చిగానే
ప్రేమిస్తుంది వద్దని వారించినా
అంతా నాదేనని మారాం
చేస్తుంది ఏదైనా
వాస్తవాలు గ్రహించదు ఏ
పరిస్థితి ఎదురైనా
శస్త్ర చికిత్స చేయాలి
మనసుకు ఎలాగైనా
అడవి మనసును పట్నం
మనసుగా మార్చాలి కొంతైనా
పాత పచ్చడిని తీసేసి
అభ్యుదయం అద్దాలి ఇప్పుడైనా
నాగరికత నేర్పాలి
మనసుకు ఏం చేసైనా
ఉన్నదా ఎక్కడైనా మనసు
దవాఖానా
తెలుసా దాని చిరునామా
ఎవరికైనా
No comments:
Post a Comment