వెలుతురునా చీకటినా
వెలిగేదీపం కింద
నక్కిన
నల్లని చీకటిని చెరిపేయాలని
నా ఆరాటం...
చందమామలో నల్లని
మబ్బులను
చిదిమేయాలని
నా ఉబలాటం...
నిప్పులు చెరిగే
సూరీడులో
నలుపు వలయాలను
లెక్కించాలని
నా ఆవేశం...
తెల్లని కాగితంపై
నల్లని అక్షరాలతోనే
నా సహవాసం...
వెలుగులో నడుస్తూ
నల్లని చీకటికి భయపడే
నేను
వెలిగే వెలుతురునా
కరిగే చీకటినా...
No comments:
Post a Comment