పిల్లర్ నెంబర్ 176
(సహారా కెఫె)
కొన్ని సంవత్సరాల
అనుబంధం
మనసుకు ఏమీ తోచనప్పుడు
ఇక్కడికే వస్తా...
ఒంటరిగానే కూర్చుంటా
వచ్చిపోయే వాళ్ళను గమనిస్తూ..
అంతా మధ్యతరగతి వాళ్ళే
అదే గొప్పోళ్ళు
అంటుంటారే థర్డ్ క్లాస్ మెంటాలిటీస్ అని
అవును అంతా వాళ్ళే..
ఎవరికి ఎవరూ ఏమీ కారు
ఒకరిమతం మరొకరిది కాదు
అయినా ఆత్మీయ
పలకరింపులు
ఖైరియత్ భాయ్ అని ఒకరు
నమస్తే అన్నా
బాగున్నావా అని మరొకరు...
తరచి చూస్తే ఒక్కో
మనసులో ఒక్కో వేదన
తమ కష్టాలపై తామే
జోకులేసుకునే పిచ్చితనం...
ఏమైతేనేం అందరూ
బంధువులే..
అసలైనా ఈ ఆత్మీయులను
చూస్తూ వాళ్ళ ముచ్చట్లను వింటుంటే ఆకలి కుడా గుర్తుకు రాదు...
స్టార్ హోటల్ లో
కూర్చుని మందు కొడుతున్నా ఇక్కడ దొరికే అనిర్వచనీయమైన తృప్తి దొరకదేమో
అనిపిస్తోంది...
No comments:
Post a Comment