అరణ్యవాసినా
అర్థం కాని వ్యర్థమైన
ఆలోచనలకు
భావుకత ముసుగేస్తూ
అక్షరాలు రాసుకుంటూ
ఉంటా ...
వేకువ పొడుచుకువచ్చినా
చల్లని వెన్నెలకై నీలి
నింగి వైపు
ఆశగా ఎదురుచూస్తూ ఉంటా
...
ఓటమి శిలను నెత్తిన
మోస్తూ
తెలియని విజయం కోసం
పిచ్చిగా పరుగులు
తీస్తూ ఉంటా ...
జనారణ్యంలో ఉంటూ
కీకారణ్యం విధానాల
కోసం
శాసనాలు రాస్తూ ఉంటా
...
ఓ చీకటి తెరను భగ్నం
చేసి
మరో చీకటి దుప్పటిని
కప్పుకుని
కృష్ణ బిలంలోకి
జారిపోతూ ఉంటా ...
తెలియని నిజం కోసం
అబద్ధాలను ముద్దాడుతూ
అలుపెరుగని బాటసారినై
నిత్యం శోధిస్తూనే ఉంటా ...
కూలిన శిఖర శిథిలాలను
తోసిరాజని
పేకమేడలు నిర్మిస్తూ
నిర్జీవ రాజ్యానికి
నియంతలా నిలిచి ఉంటా ...
నేను కవినా
అరణ్యవాసినా
వేకువలో వెన్నెలనా
ఎన్నడూ పలకరించని
గెలుపునా
గమ్యమే తెలియని
బాటసారినా
అనంతకోటి ప్రశ్నలను
నాపై నేనే
సంధించుకుంటూ ఉంటా ...
dear sir very good and very good content
ReplyDeletehttp://www.cinema.suryaa.com