సిన్నబోయిన
కలువకోసం..
నింగి చుక్కల నడుమ వెలిగే జాబిల్లికోసం
చకోరానికి ఎంత ఆరాటం...
శశిని చేరాలనే మైకంలో
రెక్కలలో ప్రేమ ఇంధనం పోసి ఎగిరే ఆ పక్షిది
ఎంత ఉబలాటం...
పుడమి చాటున కుంగిన సూరీడు మరలా ఉదయించగానే అందంగా నవ్వే
పొద్దుతిరుగుడు పువ్వులో ఎంత పరవశం...
మేఘాల పరదాల మాటున నక్కి దోబూచులాడుతున్న
చందమామను చూసి చిన్నబోయే కలువలది ఎంత ఉడుకుమోతుతనం...
చకోరమైకంలో
సూర్యముఖి పువ్వు ఆరాటంలో
చిన్నబోయిన కలువబాల మోములో దాగిఉన్న ఆరాధన
అంతులేని నిరీక్షణ
మానవమాత్రుడినైన నాలో ఉండదా...
వేచి ఉండనా ఆ చల్లని వెన్నెలకోసం
చేరగరానా ఆ నవ్వుల పువ్వులకోసం
నిరీక్షించదా నా మనసు
వికసించే నీకోసం
మనస్వినీ...
No comments:
Post a Comment