నాకెంతో ఇష్టం
ఇసుక తిన్నెలపై నడుస్తూ
అడుగుజాడలు విడువటం
నాకెంతో ఇష్టం...
ఎగసిపడే అలల విన్యాసాలకు
పోటీ పడటం
నాకెంతో ఇష్టం...
సముద్రుడి హోరులో
చెవులకు తాకే సంకేతాలను
ఆస్వాదించటం
నాకెంతో ఇష్టం...
దేహాన్ని పెనవేస్తూ
వినిపించీ వినిపించనట్టు
గుసగుసలాడే పిల్లగాలుల
కబుర్లంటే నాకెంతో ఇష్టం... మనసును దోచే ప్రకృతి కన్య
ఒడిలో సేదతీరడం
నాకు చచ్చేంత ఇష్టం...
No comments:
Post a Comment