తెలియనే తెలియదు
యుద్ధం
చేయాలనే కసి ఉంది
చేతిలో ఆయుధమే లేదు...
గెలిచితీరాలనే తపన ఉంది
లక్ష్యం ఏమిటో తెలియదు...
ఆకాశానికి నిచ్చెన వేయాలనే కాంక్ష ఉంది
పునాదులు ఎప్పుడు జారిపోయాయో తెలియదు...
పరుగులు తీయాలనే ఆశ ఉంది
మార్గమేమిటో నా పాదాలకు తెలియదు...
మనసునిండా నవ్వాలని ఉంది
నా చిరునవ్వులను ఎక్కడ
జారవిడుచుకున్నానో తెలియదు...
జీవించాలనే కోరిక ఉంది
ఎప్పుడు మరణించానో
తెలియనే తెలియదు...
No comments:
Post a Comment