ఏమో
ఏమగునో...
వయసుకు మించిన వైరాగ్యం అణువణువునా ఆవరించినదేమో
మెదడును చీల్చిన నిస్తేజం
గుండెలో తిష్ఠ వేసినదేమో
నలు దిక్కులా గూడు కట్టిన
నిశబ్ధం దిక్కులు పిక్కటిల్లేలా
గర్జిస్తున్నదేమో
చీకటి గుండెలను కోస్తున్న వెలుతురు బాకుపై
నల్లని మరకలు ఎన్నటికీ తడియారవేమో
ఏమో మౌనమునిలా
నిలిచిన శిఖరం
అగ్నిపర్వతమై రగులుతున్నదేమో...
No comments:
Post a Comment