Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 28 January 2019

నిన్న నేడు రేపు


నిన్న నేడు రేపు
నిన్న నాకు బాగా తెలుసు
అది చేసిన గాయాలూ
పూసిన లేపనాలూ
పాదాలను తాకిన విజయాలూ
కానుకగా అందించిన పరాజయాలూ
అందుకే నిన్నను నేను పట్టించుకోను...
నేడు నాతోనే ఉంది
విరిసే నవ్వులా
తారాడే కన్నీటి పువ్వులా
గెలుపులా
ఓటమిలా
నేడు నాతోనే నడుస్తూ ఉంది
అందుకే నేడు నాకు నేస్తమే...
రేపంటేనే భయం నాకు
అదింకా నాకు పరిచయం కాలేదు గనుక...


Friday, 18 January 2019

మౌనమా ఇది...

మౌనమా ఇది...

మౌనమై కనిపిస్తున్నానేమో
అప్పుడప్పుడూ
మౌనంగా నేను లేను ఎప్పుడూ
పలకరించే భావాలను వింటూ
నిదురించిన అక్షరాలను
తట్టి లేపుతూ
మనసుతో మంతనాలాడుతూనే ఉంటా
నా మనసుతో నా సంవాదం
లక్ష గొంతుకలకు సమానం...