Wednesday, 20 March 2019
Wednesday, 13 March 2019
నేను ఆనందంగానే ఉన్నా..
నేను ఆనందంగానే ఉన్నా..
అక్షరాలు రాసుకుంటున్నా
భావాలను సమాధి చేస్తూ. .
వాడిన పెదాలను మెరిపిస్తున్నా
కాగితం రంగులు అద్దుకుంటూ...
నిండుపున్నమిలా వెలుగుతూ ఉన్నా
కటిక చీకటిని మనసులో దాచుకుంటూ. .
మంచివాడిలా కనిపిస్తున్నా
నాలో దానవుడిని నిద్రపుచ్చుతూ..
నాది రాచమార్గమేనని నమ్మిస్తున్నా
పాదాలను చీల్చే ముళ్ళను ముద్దాడుతూ..
అందుకే నేనింకా ఆనందంగా ఉన్నా ..
Subscribe to:
Posts (Atom)