Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday, 27 February 2020

ప్రశాంతత


ప్రశాంతత
మనసు కనుమలలో
మెదడు తరంగాలలో
వెన్నెల జారే కన్నుల్లో
విరిసే పెదాలలో
గుచ్చుకునే అక్షరాలలో
కరిగిపోతున్న భావికల్లో
వెచ్చని కన్నీటిలో
చల్లని పలకరింపులో
చందమామ వెలుగుల్లో
నల్లని రాత్రులలో
నిరంతరం శోధిస్తున్నా
ఎన్నటికీ దొరకని
ప్రశాంతత కోసం...

Monday, 10 February 2020

మంచులా కరిగిపోతున్నా...


మంచులా కరిగిపోతున్నా...
నాతో నేను ఎందుకు పోరాడుతున్నాను
నాతో నేను ఎందుకు పెనుగులాడుతున్నాను
నానుంచి నేను ఎందుకు
విడిపోవాలని అనుకుంటున్నాను
నానుంచి నేను ఎందుకు
దూరంగా పారిపోతున్నాను
నాలో నేను ఎందుకు
ఇమడలేకపోతున్నాను
ఉక్కు భావాలే నావి ఎందుకు మంచులా కరిగిపోతున్నాను...

Wednesday, 5 February 2020

దేవుడివా దయ్యానివా?


దేవుడివా దయ్యానివా?
నా ముందుకు వచ్చి నిలబడు
నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
నన్ను పలకరించు
నాతో మాట్లాడు
నీవన్నీ కట్టు కథలు కావని నమ్మించు
పుస్తకాల దుమ్ము దులిపి నువ్వున్నావని నిరూపించు
నాకు మేలు చేయలేకున్నా చెడు చేసి చూపించు
లిప్తపాటు కనిపించు
మరు నిమిషమే మాయమవ్వు
అప్పుడు డిసైడ్ చేస్తా నేను
నువ్వు దేవుడివా దయ్యానివా...??