నన్ను దోచుకుందువటే
రాలిపడుతున్న చుక్కను
చూసి
నిన్నే కోరుకున్నాను
...
నక్షత్రాల ధూళిలో
నీ ఆనవాళ్ళే వెతికాను
ఆకారం మార్చుకునే
మేఘాల్లో
నీ బొమ్మలనే చూసాను...
నవ్వులు రువ్వే
పువ్వులలో
నీ చిరునవ్వులనే
కోరుకున్నాను
నాకు బాగా గురుతు
నువ్వేలా ఉంటావో
తెలియకున్నా
నిత్యం నీ సర్వం
నాకోసమే
కోరుకున్నాను...
వచ్చావు నువ్వు ఓ
నవ్వులా
విరిసిన పువ్వులా
నాకోసమే వచ్చిన నువ్వు
చిత్రంగా
నా నుంచి నన్నే
దోచుకున్నావు..
నీకిది న్యాయమా
మనస్విని ...
మధురభావాల సుమమాల.
ReplyDelete