ఆశ...
రెక్కలు విచ్చుకున్న ఆలోచనలు
మనసును లాగుతున్నాయి
నింగివైపు దూసుకెళదామని...
పులకించిన మనసు ఉరకలు వేస్తోంది వెలుగురేఖలను
ముద్దాడాలని...
ఇనుప సంకెలలు ఏవో పాదాలను
పెనవేస్తున్నాయి
అంత స్వేచ్ఛ నీకెందుకని...
ఆశ చావని కన్నులు
ఆకాశాన్ని అంటుతున్నాయి
ఆ నింగిని పాదాక్రాంతం
చేసుకోవాలని...
No comments:
Post a Comment