ఏమయ్యింది?
హఠాత్తుగా ఏమయ్యింది
సునామీ వచ్చింది
సునామీ ఎందుకు వచ్చింది
కడలి ఎగిసింది
ఎందుకు ఎగిసింది
ఏదో ఒత్తిడి ఏర్పడింది
అయితే ఏమయ్యింది
సునామీ తీరం దాటింది
నువ్వేం చేస్తున్నావ్
షెల్టర్ కోసం వెతుకుతూనే ఉన్నా
షెల్టర్ దొరికిందా
దొరకదని తెలిసినా పరుగులు తీస్తూనే ఉన్నా
మరేమయ్యింది
సునామీ అంతా ఊడ్చేసింది
ఇప్పుడెక్కడున్నావ్
మిగిలిన అవశేషాల మధ్య నిలిచి ఉన్నా
అక్కడేం చేస్తున్నావ్
మరో సునామీకి స్వాగతం పలికేందుకు
బలాన్ని కూడదీసుకుంటున్నా
తుఫాన్ షెల్టర్ ఉంటుది కానీ సునామీ షెల్టర్ ఇంపోసిబుల్ కదా!
ReplyDelete