యాక్ట్ ఆఫ్ గాడ్
నువ్వు కిరాతకుడివా
రోజూ పాపాలే చేస్తున్నావా
చింతవలదు
బెంగపడకు...
నువ్వు మహా పుణ్యాత్ముడివా
మిడిసి పడకు
సంతసించకు...
కిరాతకం నీది కాదు
నువ్వే పాపమూ చేయలేదు
పుణ్యమూ నీది కాదు
నువ్వే ఘనకార్యమూ చేయలేదు...
నువ్వు హిందువువైనా
ముస్లింవి అయినా
క్రైస్తవమే నీదైనా
ఒక్కసారి నీ మతగ్రంధం తెరిచి
చూడు
నువ్వు కర్తవు కాదు
క్రియవీ కాదు
సర్వం నేనే అని
ఆ దేవుడు
అభయమిస్తున్నాడు చూడు...
చింత ఏల నీకు
తోచింది చేసేయ్
నచ్చినట్లు బతికేయ్
పాపపుణ్యాల భారం దేవుడిమీదకు
తోసేయ్
యాక్ట్ ఆఫ్ గాడ్ అని సరిపెట్టేయ్...
No comments:
Post a Comment