గడసరి మల్లెలు
మల్లికా నువ్వెంత గడసరివే
పాలమీగడ వర్ణంతో
మృధువైన దేహంతో
ఆకుచాటు సోయగాలతో
పుష్పవనానికి రాకుమారిలా
కనిపిస్తావు...
దేవుని పాదాల చెంతన ఒదిగి
వరాలిచ్చే దేవతవై
గుభాళిస్తూ ఉంటావు...
మరి జవరాలి కొప్పున చేరగానే
నీలో ఎంత మార్పు
కురుల తీగలను సవరిస్తూ
మన్మదవీణను పలికిస్తావు
కొంటెగా కన్ను గీటుతూ
పరిమళాల ఆయుధాలు సంధిస్తావు
సమరానికి సై అంటూ సవాలు
విసురుతావు
మల్లికా నువ్వెంత గడసరివే...
No comments:
Post a Comment