ఇప్పుడు కాకపొతే
ఇంకెప్పుడు?
హే రామ్ అంటూ హృదయావిదారకంగా రోదిస్తున్న నీ భక్తులను చూడు...
యా అల్లాహ్ అంటూ గుండెలు పగిలేలా ఆర్తనాదాలు చేస్తున్న నీ జాతిని చూడు...
దయామయ ప్రభువా అంటూ విలపిస్తున్న నీ బిడ్డలను చూడు...
అదిగో అక్కడ కాలుతున్న దేహం నుదుటన మెరుస్తున్న తిలకం నీ నామ సంకేతమేగా...
తలపై తెల్లని టోపీతో ఒరిగిపోయిన ఆ తండ్రి నుదుటిపై నల్లని మచ్చలు నీకు
సజ్దా చేసిన గురుతులేగా...
శవపేటికలో నిదురిస్తున్న ఆ మనిషి గుండెపై కాంతులీనే శిలువ నీ వైభవ చిహ్నమేగా...
కరోనా రక్కసి మానవాళిని కబళిస్తోంది
శిలావిగ్రహం ధ్వంసం చేసి తేజోమూర్తివై కదలిరాలేవా
మసీదు గోడలను పెకిలించి కాంతిరేఖవై నడిచి రాలేవా
ఇనుపముళ్లను పెకిలించి శిలువనుంచి దిగి రాలేవా...
బూజుపట్టిన నీ పుస్తకాల పుటల్లో కాల్పనిక కథగానే
మిగిలిపోతావా...
ఉన్నావా అసలు
ఉంటే నీ శక్తిని చూపలేవా
ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడు?
No comments:
Post a Comment