మినీ డైనో్సార్
అప్పుడప్పుడే కళ్ళు మూతపడుతున్నాయి...
ఏసీ చల్లదనం వల్లనేమో అంతా మగతగా ఉంది... ఏవో శబ్దాలు.. ఉలిక్కిపడి లేచాను... ఎవరో
తలుపులను భయంకరంగా కొడుతున్నారు.. తలుపులు విరిగిపోతాయా అనిపించింది... అంతలోనే ఏవో
భయంకరమైన అరుపులు... జూరాసిక్ పార్క్ లో డైనోసార్లు అరుస్తున్నట్టుగా... అంటే నేను
జూరాసిక్ పార్క్ లో నిద్రపోతున్నానా అని ఒక్క క్షణం భయం... ఈ అనుభవం ఒక్కరోజుతో ఆగిపోలేదు..
ప్రతిరాత్రీ నాకు కాళ రాత్రే... కానీ అవి డైనోసార్ల అరుపులు కావు.. మా ముఫాసా గాడు
చేస్తున్న వికృత శబ్దాలు అవి.. ముఫాసా అంటే మా పిల్లలు పెంచుకుంటున్న లాబ్ కుక్క...
దాన్ని కుక్క అనేకంటే ఒక రాక్షసజీవి అనడం బెటర్.. ఇంట్లో సోఫాలు ఎప్పుడో చించేసాడు..
చెప్పులు షూస్ కొరికేయడం వాడికి మహా సరదా.. ఇంట్లో ఒక ఉన్మాదిలా తిరుగుతూ కనిపించిన
వస్తువును నోటకరిచి ఎక్కడో పడేస్తుంటాడు.. ఈ నరకం ఎన్నాళ్ళో... వాడెప్పుడు ఎలా బిహేవ్
చేస్తాడోనని నన్ను నేను దాచుకుని గడపాల్సిన దుస్థితి...వాడు ప్రశాంతంగా ఉన్న కొద్దిపాటి
సమయంలో అబ్బో ఎంత అమాయక జీవి అని అనుకోవాల్సిందే. వాడికళ్ళు కరుణారసంతో మనల్ని బోల్తా కొట్టించడం ఖాయం.. కానీ అది కొద్దిసేపే...మొన్న
వీడి వాక్సిన్ కోసం వెటర్నరీ ఆసుపత్రికి వెళితే నాలాంటి లాబ్ బాధితులు చాలామందే కనిపించారు.
ఇక లాబ్ బాధిత సంఘం పెట్టుకోవడమే మిగిలింది..
No comments:
Post a Comment