భారత్ వెలిగిపోతోంది
ఎవడురా నాదేశం అంధాకారంలో మగ్గిపోయిందని కూసాడు...
ఎవడురా నాదేశం రాతియుగంలోకి జారిపోయిందని ఏడిచాడు...
కళ్ళు తెరిచి చూడు
భారత్ వెలిగిపోతోంది...
ఎర్రటి చితిమంటల్లో సమిదలై మండుతున్న భారతీయ మృతదేహాలు
కాగడాలుగా మండుతూ
నాదేశాన్ని వెలిగిస్తున్నాయి...
సైన్స్ కే సవాలు విసురతూ
గోమూత్రమే దివ్య ఔషదమని చాటుతూ
ప్రపంచానికి కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది
నాదేశం...
ఉందో లేదో తెలియని కరోనాకు వెరవక
ఎన్నికలనూ మేళాలను ఘనంగా నిర్వహిస్తూ
గుండె ధైర్యాన్ని చూపుతోంది
నా దేశం...
మంటల్లో పేలుతున్న కాపాళాల ధ్వనులు మంగళ వాయిద్యాలుగా
ధర్మం కోసం యాభయ్ ఆరు ఇంచుల ఛాతీ విరుచుకుని విజయోత్సవాలు జరుపుకుంటోంది నాదేశం...
చూడరా కళ్ళు విప్పుకుని
వెలిగిపోతోంది భారతదేశం...
No comments:
Post a Comment