బయటకు వెళ్తున్నావా
కారులోనా
పర్సు బరువుగానే ఉందా గుడ్
అలాగే వెళ్ళు...
అదిగో అక్కడ పంక్చర్ షాపు
ఉంది చూడు
ఒకసారి అన్ని టైర్లలో గాలి
ఎంతుందో చెక్ చేయించుకో
పెట్రోల్ ఉందా
ఉంటే నో ప్రాబ్లమ్...
ఎలాగూ బయటికి వచ్చావుగా
అక్కడ తోపుడు బండ్లపై అమ్ముతున్న
పండ్లు కొనుక్కో
పిల్లలు తింటారులే...
ఒకటే మాస్కు ఉతికి ఉతికి
ఎన్నిసార్లు వాడతావు
చౌరాస్తాలో ఓ డజను మాస్కులు
కొనుక్కో
ఇంట్లో వాళ్ళకూ అవసరమేగా...
రెడ్ సిగ్నల్ పడింది
బ్రేక్ వేయి
అరెర్రే... పెన్నులు అమ్ముతున్న
ఆ ముసలమ్మను కసురుకుంటావెందుకు
పది రూపాయలేగా ఆ రెండు
పెన్నులు తీసుకో...
ఆ పాప ఏదో అమ్ముతోంది చూడు
కోనేసేయ్
పనికి వస్తాయిలే...
వెళ్ళు నీ పనులేవో తొందరగా
చక్కబెట్టుకో
లాక్ డౌన్ టైమ్ దగ్గరపడింది...
ఏంటీ ఆలోచిస్తున్నావ్
అనవసరంగా డబ్బులు ఖర్చయిపోయాయనా...
నువ్వు మహా అయితే ఐదొందలు
ఖర్చు పెట్టి ఉంటావ్
నీ పర్సులో ఒకటి రెండు
నోట్లు తగ్గితే నష్టమేమీ లేదు
ఆ నోట్లు కొన్ని కుటుంబాలకు
అన్నం పెట్టాయని తెలుసుకో..
చిల్లర వ్యాపారులను చిన్న
చూపు చూడకుండా
నువ్వు పెట్టిన ఖర్చు ఆ
కుటుంబాలకు ఆకలి బాధ లేకుండా చేసిన విషయం గుర్తించు
నీ పెదవులపై తప్పనిసరిగా
ఓ చిరునవ్వు వికసిస్తుంది...
No comments:
Post a Comment