వెంటాడు వేటాడు
ఓ మనిషీ
అతి భయంకర కీకారణ్యమే ఈ
జీవితం
అడుగు తీసి అడుగు వెయ్యటం
ఇక్కడ ఓ పోరాటం
ఇక్కడ పులులూ సింహాలు
పొంచి ఉంటాయి
ఏ పొదలో విషనాగు బుసకొడుతుందో
ఏ మూలన తేళ్ళు
నిద్రపోతున్నాయో
అందమైన నెమళ్ళు
నాట్యమాడుతాయి
పీక్కుతినే రాబందులూ
స్వాగతం పలుకుతాయి
ఇక్కడ దుప్పి రక్తం తాగుతుంది
వానపామూ పడగ విప్పుతుంది
కుందేలూ తొడకొడుతుంది
అందమైన పూలవనం పలకరిస్తుంది
పువ్వు చాటున ముల్లు
గాయం చేస్తుంది
ఇక్కడ ప్రతిదీ భయానకమే
అంతా మాయాజాలమే
అడుగు ముందుకు పడాలంటే
పోరాటమే
బతికి బట్ట కట్టాలంటే
తొక్కేయ్
అణిచేయ్
వెంటాడు
వేటాడు
ఈ జీవితం
కీకారణ్యంలో
వేట వంటిదే
వేట ఆగిందా
జీవితం నిన్ను వేటాడేస్తుంది
పులిమీద సవారీ లాంటిదే.
ReplyDelete