Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Tuesday, 26 June 2018

మనస్వినీ ఓ మనస్వినీ

మనస్వినీ ఓ మనస్వినీ

తెల్ల కాగితంపై 
సప్త వర్ణాలు అద్దినట్టు
నిస్తేజ నయనాలకు
వెన్నెల సంతకం నేర్పినట్టు
ఇసుక తిన్నెలపై
గులాబీ నవ్వులు రువ్వినట్టు
కొలనులో
 
కలువ విరిసినట్టు
మనసుతోటలో
మనస్వినియై పూసిన
నా శ్రీమతికి
వివాహదినోత్సవ
ప్రేమాభినందనలు

Thursday, 7 June 2018

ఆలోచనావలయం

ఆలోచనావలయం
సమూహం కళకళలాడుతోంది.
అంతా హడావిడి
పిల్లల కేరింతలు
పెద్దవాళ్ళ ముచ్చట్లు
అందరూ నన్ను పలకరిస్తున్నారు..
దగ్గరి బంధువులు
 
దూరపు చుట్టాలు
చిన్ననాటి స్నేహితులు
కుశల ప్రశ్నలు
పరాచికాలు
అందరిలోనే ఉన్నా
అందరితో మాట్లాడుతున్నా
అయినా అందరిలో లేను
మాటలు నాలుక దాటుతున్నా
మనసు మౌనంగానే ఉంది
జనసమూహంలో నేనున్నా
శూన్యంలో ఒంటరినై కూర్చున్నా
ఏమయ్యింది నాకు
ఏ అవసరం అనవసరమై
ఒంటరిని చేసింది నన్ను
మనసు చుట్టూ వలయమై అల్లుకున్న ఆలోచనలతో
అందరిలో ఉన్నా ఒంటరిగానే
మిగిలిపోయాను నేను..

మనసులో లేకుండాపోతావ్

మనసులో లేకుండాపోతావ్


మసీదును కూల్చేయ్ అల్లా పట్టించుకోడు
మందిరాన్ని ధ్వంసం చేయ్
 
రాములోరు కన్నెత్తికూడా అటు చూడరు
చర్చిని పడగొట్టు
జీసస్ కదలనూ లేడు
మనిషి కొలువైన మనసు గుడిని కూల్చకు
మనసులో లేకుండాపోతావ్

నా నేస్తం

నా నేస్తం

ఎంత అందమైనది నా నేస్తం
ఎంత ప్రియమైనది నా నేస్తం
మనసు ప్రశ్నలు వింటుంది
మనసుతోనే సమాధానమిస్తుంది
అదే నేనూ నా మౌనం
అదే నా స్నేహం...