Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 21 September 2018

ఇలా అనిపిస్తోంది...

ఇలా అనిపిస్తోంది...

చెవులకు పరిచయమే లేని
ఓ కమ్మని గీతం వినాలని ఉంది..
మైమరిపించే సరికొత్త సవ్వడిలో
 
మునిగితేలాలని ఉంది..
కనులకే తెలియని నవ్యాక్షరాలతో
 
భావగీతికలను
ప్రవచించాలని ఉంది...
అందరున్నా ఒంటరై విలపించే
మనసుకు నన్ను నేను
పరిచయం చేసుకోవాలని ఉంది..
నా మనసుకు నేనై నాకు నా మనసై
 
సాంత్వన పొందాలని
ఉంది...
అప్పుడప్పుడూ ఇలా
నన్ను నేనే
మరిచిపోవాలని ఉంది..

No comments:

Post a Comment