దయ్యాలు
దేవుడెలాగూ దొరికేలా లేడు
దయ్యాలను వెతకాలని అనుకున్నా
స్మశానాల్లో శోధించా
కీచరాళ్ల సవ్వడి తప్ప
పిశాచాల కీచుగొంతులు
వినిపించనే లేదు
ఊడలమర్రి కొమ్మలలో వెతికా
ఆకులు రాలుతున్నాయి తప్ప
దయ్యం ఆనవాళ్లే కానరాలేదు
ఊళ వేసే నక్కను అడిగా
గబ్బిలాల గుంపులో వెతికా
దయ్యలూ భూతాలు మాకు తెలియదని అన్నాయి
అలసిసొలసి నగరంలోకి నడిచా
వీధిదీపాల వెలుగుల్లో
చీకటిగదుల సరాగాలలో
విఫణి వీధుల్లో
మనసుల సంతలో
అనుబంధాల ముసుగులో
లక్షలాది దయ్యాలు హాహాకారాలు చేస్తూ కనిపించాయి
మనిషిలో దేవుడున్నాడో లేడో గానీ అణువణువునా దయ్యం ఉందని తెలుసుకున్నా
మరి నాలో ఏ దయ్యం దాగుందో...
మన చుట్టూ మనిషి ముసుగులో చాలా దెయ్యాలు ఉన్నాయి...
ReplyDeleteమీరు చెప్పింది అక్షర సత్యం...