నాకు జీవించాలని ఉంది
నాకింకా జీవించాలని ఉంది
చందమామ వెన్నెల్లో ఆడుకోవాలని
ఉంది
నా అక్షరాలకు ప్రాణంపోసి
అందమైన పుష్పాలను విరబూయాలని ఉంది
మాట్లాడాలని ఉంది
వినాలనీ ఉంది
ఆడాలని ఉంది
ఆడించాలని ఉంది
పాడాలని ఉంది
పాడించాలనీ ఉంది
అయితే
ఈ మృతజీవుల కళేబరాలతో నడవాలని
లేదు
గుండెలేని మరజీవులను పలకరించాలని
లేదు
మనసు కాలిన కమురు వాసన
నిండిన లోకంలో బతకాలని లేదు...
No comments:
Post a Comment