మళ్ళీ చంపేస్తారా?
కట్టడి పేరుతో కట్టిపడేసి
చంపేశారు
మళ్ళీ పుట్టాలని అనుకుంటున్నా
లేచి నిలబడాలని చూస్తున్నా
ఇంకా నేను పుట్టనేలేదు
మళ్ళీ చంపేస్తారా
ఏంటిరా ఇదీ
నేను బతకడమే మీకు ఇష్టం
లేదా...
ఓ పురుగు వచ్చిందన్నారు
అందరినీ కాటేస్తుందని భయపెట్టారు
ఎందరిని కాటేసిందో తెలియదు
గానీ
మీరు నన్నెందుకు కాటేశారు?
వాక్సిన్ అన్నారు
డోసు పెంచారు
ఇప్పుడు బూస్టర్ అంటున్నారు
ఏం మీ మందులేవీ పనికిరావా
ఇప్పుడు ఓమిక్రాన్ అంటూ
జడిపిస్తున్నారు...
సిగ్గూ శరం ఉందా మీకు
ఎన్నికల జాతర చేస్తారు
లక్షలమంది చేరి భజన చేస్తారు
దేవుడిపేరుతో నిబంధనలు
ఉల్లంఘిస్తారు
ర్యాలీలు రోడ్ షోలు
ఘనంగా చేస్తారు
మీకు లేదా కట్టడి?
ఎందుకురా నన్ను మాత్రమే
చంపుతారు
లాక్ డౌన్ పేరుతో ఆయువు
తీస్తారు
చచ్చిన నేను మళ్ళీ పుట్టాలంటేనే
భయం వేస్తోంది
లాక్ డౌన్ పేరుతో మళ్ళీ
చంపేస్తారేమోనని...
No comments:
Post a Comment