నవలోకం
పరిమళించే పున్నమిలో
వెన్నెల జలకాలాడాలని
ఉంది
వికసించిన తోటలో
అందమైన పువ్వులా
నవ్వాలని ఉంది
మెరిసే హిమవన్నగంలో
స్వాతిముత్యమై
కరిగిపోవాలని ఉంది
విరిసే పెదాలలో
ఓ నవ్వులా
మెరిసిపోవాలని ఉంది
భావాల ఝరిలో
అక్షర వర్షమై
కురిసిపోవాలని ఉంది
నన్ను మెచ్చని లోకం
వీడి
మరోప్రపంచం శోధించాలని
ఉంది
తథ్యమైన మరణంతో నన్ను
పునీతం చేసి
భగవాన్
నవలోకానికి నాంది
పలకవా
No comments:
Post a Comment